Teja Sajja Remuneration: టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన తేజ సజ్జ రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!

Teja Sajja: ఇండస్ట్రీలో తమ ఖాతాలో పడే హిట్లను బట్టి హీరోల రెమ్యునరేషన్ అమౌంట్ పెరిగిపోతుంది. నాలుగైదు ఫ్లాప్ లు ఉన్నా సరే ఒక సూపర్ డూపర్ హిట్ పడితే చాలు.. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని సాలిడ్ గా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కుర్ర హీరోలు. హనుమాన్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న తేజ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 06:00 PM IST
Teja Sajja Remuneration: టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన తేజ సజ్జ రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!

HanuMan Hero Teja Sajja:  తేజ సజ్జా.. నిన్న మొన్నటి వరకు పెద్దగా తెలియని పేరు. అయితే హనుమాన్ మూవీ తర్వాత వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ అయిపోయింది. చిన్న సినిమా అని అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నా.. కంటెంట్ మీద నమ్మకంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రికార్డులు బద్దలు కొట్టి సూపర్ డూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ ఒక మూవీ క్రేజ్ తో తేజ..2024 గూగుల్ వికీపీడియాలో మోస్ట్ సెర్చెడ్ సౌత్ ఇండియన్ సెలబ్రిటీ గా  గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతను ప్రభాస్, మహేష్, విజయ్ లాంటి స్టార్ హీరోలను కూడా ఈ విషయంలో ఓవర్ టేక్ చేసేసాడు.

చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి కొడుకుగా తన కెరీర్ మొదలు పెట్టాడు తేజ. తేజ చైల్డ్ ఆర్టిస్టుగా ఎందరో స్టార్ హీరోలతో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ చేసిన జాంబిరెడ్డి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు అనుకున్న ఫలితాలను అందించకపోయినప్పటికీ హనుమాన్ రూపంలో అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ రికార్డు అయింది.

మామూలుగా ఇటువంటి సక్సెస్ ఒక స్టార్ హీరో ఖాతాలో పడితే అతని రెమ్యూనరేషన్ అమాంతం 70 నుంచి 100 కోట్లకు వెళ్ళిపోతుంది. అదే ఒక టైర్ 2 స్టార్ ఈ సక్సెస్ అందుకున్నట్లయితే 10 కోట్లకు పైనే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి.. హనుమాన్ మూవీ బద్దలు కొట్టిన రికార్డులను పట్టి.. వరల్డ్ వైడ్ పొందిన పాపులారిటీతో తేజ టైర్ 2 హీరోలతో సమానం అయిపోయాడు.

హనుమాన్ సినిమా కోసం తేజ మొదట అందుకున్న పారితోషకం కోటి రూపాయలు.అయితే మూవీ అనూహ్యమైన విజయం సాధించడంతో నిర్మాత అతనికి మరొక 5 కోట్లు ముట్ట చెప్పాడు. దీంతో తేజ హనుమాన్ మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 6 కోట్లు అవుతుంది. తన స్క్రిప్టుల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేసే తేజ ఇదే రకమైన ఆపిలింగ్ కంటెంట్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగితే.. అతని క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

Also ReadSamudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News