Krithi Shetty photo shoot: సంక్రాంతి స్పెషల్​ ఫొటోలతో కుర్రకారు మది దోచేస్తున్న కృతి శెట్టి!

Krithi Shetty photo shoot: హీరోయిన్ కృతి శెట్టి సంక్రాంతి సందర్భంగా స్పెషల్​  ఫొటో షూట్​లో పాల్గొంది. కుర్రకారు మది దోచేలా ఉన్న ఆ ఫోటోలను చూసేద్దామా..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 11:38 PM IST
  • కృతి శెట్టి సంక్రాంతి ఫొటో షూట్​
  • కుర్రకారు మది దోచేస్తున్న 'ఉప్పెన' బామ
  • టాలీవుడ్​లో వరుస సినిమాలతో బిజీ బిజీ
Krithi Shetty photo shoot: సంక్రాంతి స్పెషల్​ ఫొటోలతో కుర్రకారు మది దోచేస్తున్న కృతి శెట్టి!

Krithi Shetty photo shoot: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీతోనే మంచి విజయాన్నిఅందుకున్న కృతి శెట్టి (Krithi Shetty  latest news).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

కృతి శెట్టి హీరోయిన్​గా నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు' సంక్రాంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించింది (Krithi Shetty in Bangarraju) కృతి శెట్టి.

ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్​ లుక్​లో కృతి శెట్టి కొత్త ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ఆమాయకపు చూపుతో.. మోముపై చిరు నవ్వులు చిందిస్తున్న కృతి శెట్టి ఫొటోలు కుర్రకారు మది (Krithi Shetty Sankranthi Special photo shoot) దోచేస్తున్నాయి. ఆ ఫొటోలు మీరు చూసేయండి మరి..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

కృతి శెట్టి గురించి..

కృతిశెట్టి.. 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగుళూరులో (Krithi Shetty date of birth) జన్మించింది.

మెగా హీరో వైష్ణవ్​ తేజ్ హీరోగా పరిచయమైన 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్​లోకి అడుగు పెట్టింది (Krithi Shetty in Uppena movie) కృతి శెట్టి. అంతకు ముందు సూపర్​ 30 అనే హిందీ సినిమాలోను నటించింది. హీరోయిన్​గా మాత్రం ఉప్పెన మొదటి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో కృతి శెట్టికి టాలీవుడ్​లో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

సినిమాల కన్నా ముందు కృతి శెట్టి చైల్డ్ మోడల్. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ప్రకటనల్లో మంచి గుర్తింపే సినిమా ఆఫర్లకు కారణం.

ఇటీవల నాని హీరోగా వచ్చిన 'శ్యామ్​ సింగరాయ్'​ సినిమాలోను హీరోయిన్​గా చేసింది కృతి శెట్టి. హీరోయిన్​గా ఇది రెండో సినిమా కాగా.. ఇందులో అమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా బంగార్రాజు సినిమాలో పెల్లెటూరు అమ్మాయిలా కనిపించింది కృతి శెట్టి. మూడు సినిమాల్లో మూడు కొత్త లుక్​లలో కనిపించింది.

సుదీర్​ బాబు హీరోగా వస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలోనూ హీరోయిన్​గా నటించింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోంది కృతి శెట్టి. ఈ సినిమాతో తమిళ్​లోకీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాపై పూర్తి వివరాలు ఇంకా తెలియల్సి ఉంది. అయితే ఈ మూవీ తెలుగులోను ఏకకాలంలో షూటింగ్ జరుపుకుని విడుదల కానున్నట్లు సమాచారం.

నితిన్​ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలోనూ హీరోయిన్​గా ఎంపికైంది కృతి శెట్టి. ఈ చిత్రం షూటింగ్​ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలన్ని.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే విడుదలవనున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు పూర్తయిన నేపథ్యంలో మరిన్ని మూవీస్​కు కృతి శెట్టి సైన్​ చేసే అవకాశలున్నాయి.

Also read: RGV Sensational Tweet: 'నేను చావాలన్న మీ కోరిక నెరవేరాలి'.. రామ్​ గోపాల్​ వర్మ ట్వీట్!

Also read: Chaysam divorce: అయ్యో పాపం నందిని రెడ్డి.. చై-సామ్ విడాకులతో చిక్కులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News