Annapurna Photo Studio OTT: అప్పుడే ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Annapurna Photo Studio Movie: చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన చిత్రం 'అన్నపూర్ణ స్టూడియో'. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైంది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 07:37 AM IST
Annapurna Photo Studio OTT: అప్పుడే ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Annapurna Photo Studio in OTT: '30 వెడ్స్‌ 21′ వెబ్‌ సిరీస్‌తో అందరినీ ఆకట్టుకున్న నటుడు చైతన్యరావు( Chaitanya Rao). ఇతడి తాజా చిత్రం 'అన్నపూర్ణ స్టూడియో'(’Annapurna Photo Studio). యూట్యూబ్ ఫేమ్ లావాణ్య కథానాయికగా నటించింది.  'ఓ పిట్ట కథ' సినిమా సినిమాను తెరకెక్కించిన చెందు ముద్దు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 21న థియేటర్లలో రిలీజై మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ, లవ్, సస్పెన్స్, క్రైమ్.. ఇలా అన్ని అంశాలు కలబోసిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఈటీవీ వీన్(ETV Win)లో ఈ మూవీ ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈటీవీ వీన్. 

ఈ సినిమాను  బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించారు. గతంలో పెళ్లిచూపులు, డియ‌ర్ కామ్రేడ్ వంటి హిట్‌ సినిమాలను ఈ బ్యానరే నిర్మించింది. అయితే అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ రిలీజ్‌ చేయడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రెట్రో కామెడీ ఎంటర్‌టైనర్‌లో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, ఆదిత్య, యశ్ రంగినేని, వాసు ఇంటూరి తదితరులు కీలకపాత్రల పోషించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. ''అన్నపూర్ణ ఫొటో స్టూడియోలోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉండండి... ''అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ వీన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

Also Read: Star kids Craze: బాలీవుడ్‌లో అడుగుపెట్టకుండానే ఫుల్ ఫాలోయింగ్‌లో స్టార్ కిడ్స్

Also Read:సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ప్రభుదేవా 'వూల్ఫ్' టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News