GOAT: చెన్నై సూపర్ కింగ్స్ వల్లే GOAT సినిమా ఫ్లాప్ అయింది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

GOAT movie review: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం GOAT ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు అందుకోలేకపోయింది. అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా చాలా వరకు విఫలం అయింది. అయితే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణం.. చెన్నై సూపర్ కింగ్స్ అంటూ చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 10, 2024, 10:22 AM IST
GOAT: చెన్నై సూపర్ కింగ్స్ వల్లే GOAT సినిమా ఫ్లాప్ అయింది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

GOAT movie collections: దళపతి విజయ్ హీరోగా.. తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. గతవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా GOAT. ఈ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీ కాబోతున్న విజయ్ కెరియర్ లో ఆఖరి సినిమా ఇది. కాబట్టి ముందు నుంచి ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

సినిమా టీజర్, ట్రైలర్, పాటలు యావరేజ్ గా ఉన్నా సినిమా మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది అని ఫాన్స్ అసలు పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తమిళ్లో విజయ్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా కలెక్షన్లు అంతంతమాత్రంగా అయినా ఉన్నాయి.. కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు నార్త్ బెల్ట్ లో సినిమా కలెక్షన్లు దాదాపు డిజాస్టర్ సినిమా లాగానే ఉన్నాయి. 

సినిమా ఫ్లాప్ అయిందన్న నిరాశతో ఫ్యాన్స్ డైరెక్టర్ వెంకట్ ప్రభుని సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోరు విప్పిన వెంకట్ ప్రభు.. సినిమా ఫెయిల్యూర్ విషయం మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా క్లైమాక్స్ లో క్రికెట్ ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్, టీం కెప్టెన్ ఎంఎస్ ధోనీల రిఫరెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా GOAT సినిమా హిందీ లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. సరిగ్గా ఆడక పోవడానికి కారణం అదే అని అంటున్నారు వెంకట్ ప్రభు. "ఎప్పటినుంచో నేను చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని అని.. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ నన్ను తిడుతూనే ఉంటారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ని ఇష్టపడటం నా బ్లడ్ లోనే ఉంది. ఆ విషయంలో నేను ఏమి చేయలేను" అని అన్నారు వెంకట్ ప్రభు.

అయితే ఒక్క సన్నివేశంలో వచ్చిన చిన్న రిఫరెన్స్ కారణంగా సినిమా ఫ్లాప్ అవ్వదని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకున్నా కూడా.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు నార్త్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని.. కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంకట్ ప్రభు చెప్పిన కారణం చాలా సిల్లి గా ఉంది అంటూ ఫాన్స్ మరొకసారి ట్రోల్ చేస్తున్నారు.

Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..

Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News