Thalapathy Vijay: ట్విట్టర్ ట్రెండింగ్​లో విజయ్ కు తొలి స్థానం...రెండు, మూడు స్థానాల్లో పవన్, మహేశ్!

Thalapathy Vijay: 2021 సంవత్సరానికి సంబంధించి తమిళ హీరో విజయ్ ట్విట్టర్ ట్రెండింగ్​లో మెుదటి స్థానం సంపాదించుకున్నాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 09:41 PM IST
Thalapathy Vijay: ట్విట్టర్ ట్రెండింగ్​లో విజయ్ కు తొలి స్థానం...రెండు, మూడు స్థానాల్లో పవన్, మహేశ్!

Thalapathy Vijay: దళపతి విజయ్ ట్విట్టర్ ట్రెండింగ్​లో తొలి స్థానం దక్కించుకున్నాడు. ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా కోలీవుడ్‌ నటుడు విజయ్(Thalapathy Vijay), ఆయన నటించిన 'మాస్టర్‌' సినిమా గురించే ఎక్కువగా ట్వీట్లు చేశారట. ఈవిషయాన్ని ట్విటర్‌ ఇండియా(Twitter India) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 

Also Read: Sunny Leone: లుంగీ డ్యాన్స్‌ ఇరగదీసిన సన్నీ లియోన్‌.. స్టెప్పులు మాములుగా లేవుగా (వీడియో)!!

ఈ ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో...2021కు సంబంధించి 'మోస్ట్‌ ట్వీటెట్‌ యాక్టర్‌, యాక్ట్రస్‌, సినిమా ఇన్‌ సౌత్ ఇండియా' జాబితాలను ట్విటర్‌(Twitter) విడుదల చేసింది. దాని ప్రకారం నటుల జాబితాలో విజయ్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా.. పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), మహేశ్‌బాబు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. హీరోయిన్స్ లో కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రథమ స్థానం దక్కించుకోగా..పూజా హెగ్డే, సమంత తర్వాత స్థానాల్లో నిలిచారు. టాప్ టెన్ సినిమాల జాబితాలో మాస్టర్(Master) తొలి స్థానం దక్కించుకుంది. 

టాప్‌ టెన్‌ హీరోలు
1.విజయ్‌ 2.పవన్‌కల్యాణ్‌ 3.మహేశ్‌బాబు 4.సూర్య 5.తారక్‌ 6.అల్లు అర్జున్‌ 7.రజనీకాంత్‌ 8.రామ్‌చరణ్‌ 9.ధనుష్‌ 10.అజిత్‌

టాప్‌ టెన్‌ హీరోయిన్స్
1.కీర్తిసురేశ్‌ 2.పూజాహెగ్డే 3.సమంత 4.కాజల్‌ 5.మాళవికా మోహన్‌ 6.రకుల్‌ ప్రీత్‌సింగ్‌ 7.సాయిపల్లవి 8.తమన్నా 9.అనుష్క 10.అనుపమ పరమేశ్వరన్‌

టాప్‌ టెన్‌ సినిమాలు
1.మాస్టర్‌ 2.వాలిమై 3.బీస్ట్‌ 4.జైభీమ్‌ 5.వకీల్‌సాబ్‌ 6.ఆర్‌ఆర్‌ఆర్‌ 7.సర్కారువారి పాట 8.పుష్ప 9.డాక్టర్‌ 10.కేజీఎఫ్‌-2

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News