Leo Movie: సంజయ్ దత్ గొంతు పట్టుకున్న దళపతి విజయ్, వైరల్ అవుతున్న న్యూ లుక్..

Leo Movie: లియో నుంచి మరో పోస్టర్ వచ్చేసింది. ఇందులో ఆవేశం మీదున్న విజయ్.. సంజయ్ దత్ గొంతు పట్టుకున్నాడు. తాజాగా విడుదల చేసిన లుక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2023, 10:58 PM IST
Leo Movie:  సంజయ్ దత్ గొంతు పట్టుకున్న దళపతి విజయ్, వైరల్ అవుతున్న న్యూ లుక్..

Leo new poster: లియో నుంచి వరుస పోస్టర్లు రిలీజ్ చేస్తూ.. మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు విజయ్ మూవీపై వీర లెవల్లో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఫైర్ మీదున్న విజయ్..సంజయ్ దత్ గొంతు పట్టుకోవడాన్ని చూపించారు. అంతేకాకుండా ఈ పోస్టర్ పై "కీప్ కామ్ అండ్ ఫేస్ ద డెవిల్" అనే డైలాగ్ రాసి ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ యెుక్క పోస్టర్లును విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది మూవీటీమ్. ఈ మధ్యనే తెలుగు పోస్టర్ కూడా వచ్చింది. ఇది విజయ్ ఇన్స్టాగ్రామ్ లో రికార్డు వ్యూస్ సాధించింది. అంతేకాకుండా పుష్ప 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. 

దళపతి విజయ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు  లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ కు జోడిగా త్రిష నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నడు. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ గ్యాంగస్టర్ కథ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ సాగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రన్ టైమ్ 2.30 గంటలగా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కోలీవుడ్ టాప్ డైరక్టర్ ల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు.  ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇతడు నుంచి సినిమా వస్తుందంటే ఆడియెన్స్ లో భారీగా అంచనాలు ఉంటాయి. మరి లియో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. 

Also Read: Sai Pallavi Marriage: సాయిపల్లవి పెళ్లి గురించి నిజం చెప్పేసిన ఆ మూవీ డైరెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News