Mahesh Babu Fans TRolls Thaman : తమన్ పరిస్థితి ఎందుకింత దిగజారింది!.. ఆ అతి మాటలే కారణమా?

Mahesh Babu Fans TRolls Thaman మహేష్‌ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా క్షణాల్లో చేసేస్తుంటారు. ప్రస్తుతం వారంతా కూడా తమన్ మీద పడ్డారు. మహేష్‌ బాబు సినిమాలోంచి తమన్ తీసేయండని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 08:41 AM IST
  • తమన్ మీద మరోసారి ట్రోలింగ్
  • భగ్గుమన్న మహేష్‌ బాబు ఫ్యాన్స్
  • ట్రోలింగ్‌ను తిప్పి కొట్టిన తమన్
Mahesh Babu Fans TRolls Thaman : తమన్ పరిస్థితి ఎందుకింత దిగజారింది!.. ఆ అతి మాటలే కారణమా?

Mahesh Babu Fans TRolls Thaman తమన్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆయన హీరోల గురించి చెప్పే మాటలు, స్టేజ్ ఎక్కితే హీరోల భజన చేయడం, ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రకం అంటూ నెటిజన్లు తమన్‌ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. చిరంజీవి ఫ్యాన్ అంటాడు.. బాలయ్య దేవుడు అని అంటాడు.. పవన్ కళ్యాణ్‌ ఇష్టమని అంటాడు.. మహేష్‌ బాబుతో పని చేయడం డ్రీమ్ అంటాడు.. విజయ్‌కి లైఫ్ లాంగ్ ఫ్యాన్ అంటాడు. ఇలా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు.

అందుకే ఇప్పుడు తమన్ మీద అందరి హీరోల ఫ్యాన్స్ అసంతృప్తితోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మహేష్‌ బాబు ఫ్యాన్స్ తమన్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ మహేష్‌ బాబు కలిసి చేస్తోన్న SSMB 28 నుంచి తమన్‌ను తీసేయండంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. దీనిపై తమన్ కూడా స్పందించాడు. తన మీద వస్తోన్న నెగెటివిటీ మీద స్పందించాడు. మీరు చిన్న పిల్లలురా.. మీ నెగెటివిటీకి ఇదే నా క్రియేటివిటీ అని చెప్పుకొచ్చాడు.

అయితే SSMB 28 నుంచి తమన్‌ను తీసేసి అనిరుధ్‌ను పెట్టుకోండి అని అభిమానులు సలహాలు ఇస్తున్నారు. విజయ్ లోకేష్‌ కనకరాజ్ సినిమాకు సంబంధించిన లియో బ్లడీ స్వీట్‌ ప్రోమో, అందులో అనిరుధ్ మ్యూజిక్‌ హైలెట్ అయింది. అలాంటి థీమ్, పాటలు, ఆర్ఆర్ కావాలని మహేష్‌ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతే గానీ రొటీన్ రొడ్డ కొట్టుడు కొట్టే తమన్ వద్దంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మరి వాటిని మేకర్లు పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. అయినా తమన్ కూడా త్రివిక్రమ్ సినిమాలకు ది బెస్ట్ ఇస్తుంటాడు. మహేష్‌ బాబుకి కూడా స్పెషల్‌గానే కొడతాడు. దూకుడు, బిజినెస్ మెన్, సర్కారు వారి పాట హిట్లు కాగా.. ఆగడు డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తమన్ అయితే తన మ్యాగ్జిమమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ సినిమాకు ఎలా ఇస్తాడో చూడాలి.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News