'The Kashmir Files' Trailer: ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న 'ది కశ్మీర్​ ఫైల్స్'​ ట్రైలర్..

'The Kashmir Files' Movie: డైరెక్టర్​ వివేక్​ అగ్నిహోత్రి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ది కశ్మీర్​ ఫైల్స్​'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 07:02 PM IST
'The Kashmir Files' Trailer: ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న 'ది కశ్మీర్​ ఫైల్స్'​ ట్రైలర్..

'The Kashmir Files' Movie Trailer Out: 'ది తాష్కెంట్​ ఫైల్స్'​ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్​ వివేక్​ అగ్నిహోత్రి తెరకెక్కిస్తోన్న తాజా హిందీ చిత్రం 'ది కశ్మీర్​ ఫైల్స్​' (The Kashmir Files). 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుపమ్​ ఖేర్ (anupam kher), మిథున్​ చక్రవర్తి (mithun chakraborty), దర్శన్​ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 

1990లో కశ్మీర్​లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన దారుణ మారణకాండను దర్శకుడు​ వివేక్​ అగ్నిహోత్రి భావోద్వేగంగా చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ ట్రైలర్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రశంసల జల్లు కురిపించింది. ట్రైలర్ చూస్తుంటే..చిత్రాన్ని ఎంత బాగా తీశారో అర్థమవుతోందని..తాను కూడా ఈ మూవీ కోసం వేచిచూస్తున్నట్లు కంగనా తెలిపారు. 

వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri) దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్‌' చిత్రాన్ని జీ స్టూడియోస్, ఐయాం బుద్ధ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరియు వివేక్ అగ్నిహోత్రి నిర్మించారు. ''32 సంవత్సరాల తరువాత కూడా భావోద్వేగాలు, బాధ అలాగే ఉన్నాయి'' అంటూ నిర్మాతలు రాసుకొచ్చారు. 

Also Read: NBK 107 First look: ఎన్​బీకే 107 ఫస్ట్​లుక్​- సరికొత్త మాస్​ గెటప్​లో బాలకృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News