NBK 107 First look: ఎన్​బీకే 107 ఫస్ట్​లుక్​- సరికొత్త మాస్​ గెటప్​లో బాలకృష్ణ

NBK 107: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్​గా చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 06:56 PM IST
  • ఎన్​బీకే 107 మూవీ నుంచి బిగ్ అప్​డేట్​
  • బాలయ్య ఫస్ట్ లుక్​ విడుదల
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా..
NBK 107 First look: ఎన్​బీకే 107 ఫస్ట్​లుక్​- సరికొత్త మాస్​ గెటప్​లో బాలకృష్ణ

NBK 107 first Look: గత ఏడాది విడుదలైన అఖండ సినిమా సినిమా విజయంతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ మాలినేని దరశకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి నేడు ఓ అప్​డేట్ వచ్చిది.

ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. మైనింగ్​ గనుల ముందు..  బ్లాక్​ కలర్​ షర్ట్​, పక్కన ల్యాండ్ రోవర్​ కారు..తో బాలయ్య డిఫరెంట్​గా ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ లుక్ సరికొత్తగా ఉంది.

సినిమా గురించి..

ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నటిస్టోంది. ఇక దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​ కుమార్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక క్రాక్​ వంటి విజయంతో ఊపు మీదున్న గోపిచంద్ మాలినేని.. బాలకృష్ణ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

అఖండను తన మ్యూజిక్​తో మరో లెవల్​కు తీసుకెళ్లిన తమన్​.. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్​లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News