Maha samudram first look: శర్వానంద్. టాలీవుడ్‌లో గ్యారంటీ సినీ నటుల్లో ఒకడు. వైవిద్యమైన కుటుంబ కధా చిత్రాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చే నటుడు. ఇప్పుడు మరో వైవిద్యమైన చిత్రానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది.
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు శర్వానంద్. లవ్, కుటుంబ కధా చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆ కథాంశాలతో హిట్ సినిమాలిచ్చిన నటుడు శర్వానంద్. ఇప్పుడు మరో వైవిద్యమైన కథాంశంతో కూడిని సినిమాలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద..సిద్ధార్ధ్‌తో కలిసి నటించిన మహా సముద్రం త్వరలో విడుదల కాబోతుంది. శర్వానంద్ పుట్టినరోజు (Sharwanand Birthday) సందర్బంగా మహా సముద్రం సినిమా ఫస్ట్‌లుక్( Maha samudram first look) విడుదలైంది. ఈ సినిమా కాస్త మాస్ కధాంశంతో ఉండబోతోంది. పోస్టర్‌లో శర్వానంద్ మాస్,రఫ్‌లుక్‌లో కన్పిస్తున్నాడు.
From our Tale of #ImmeasurableLove
Unveiling my LOOK from #MahaSamudram 🌊@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @AKentsOfficialhttps://t.co/vTdLxtpLTG pic.twitter.com/1uh0TxVqYr
— Sharwanand (@ImSharwanand) March 6, 2021
ఆర్ఎక్స్ 100 చిత్రం( RX 100 Movie )తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్(Anu immannuel), అదితి రావ్ (Aditirao hyderi)లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ఫస్ట్‌లుక్ ఓ ఫైట్ సీన్‌ను తలపిస్తోంది. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ మోడ్‌లో రౌద్రంగా కన్పిస్తున్న శర్వానంద్ ఫస్ట్‌లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మహా సముద్రం సినిమాపై ఇటు శర్వానంద్( Sharwanand), అటు హీరో సిద్ధార్ధ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కెరీర్‌కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం.
Also read: Sreekaram Trailer: శ్రీకారం ట్రైలర్.. రైతుల జీవితం గురించే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook