భార్యను వేధించిన కేసులో టాలీవుడ్ హీరో అరెస్టు..!

పంచాక్షరీ అనే తెలుగు సినిమాతో పాటు పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించిన నటుడు సామ్రాట్ రెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Jan 31, 2018, 12:15 AM IST
భార్యను వేధించిన కేసులో టాలీవుడ్ హీరో అరెస్టు..!

పంచాక్షరీ అనే తెలుగు సినిమాతో పాటు పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించిన నటుడు సామ్రాట్ రెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ఓ మహిళను ఆయన వివాహం చేసుకున్నాడని.. అయితే అభిప్రాయభేదాల వల్ల వీరిద్దరూ గతకొంత కాలంగా వేరుగా ఉంటున్నారని.. అయినా సామ్రాట్ ఆమెను  వేధిస్తున్నాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సామ్రాట్ భార్య ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తూ.. తను ఆమె ఇంటికి వచ్చి సీసీ కెమెరాలతో పాటు ఫర్నీచర్ ధ్వంసం చేశాడని.. అలాగే ఇంట్లోని నగలు ఎత్తుకెళ్లాడని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ క్రమంలో సామ్రాట్ పై వేధింపులతో పాటు దొంగతనం కేసు కూడా నమోదు చేసిన పోలీసులు ఆయనను సెక్షన్ 498 ఏ క్రింద అరెస్టు చేశారు. 

Trending News