Prabhas: తెలుగు స్టార్ హీరోలకి గుణపాఠం.. డార్లింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!

Prabhas Kalki Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే చాలా ముందు ఉన్నారు. కెరియర్ పరంగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతేకాకుండా కల్కి సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక సినిమాల విషయంలో.. ప్రభాస్ ని చూసి తెలుగు స్టార్ హీరోలు చాలా నేర్చుకోవాలి.. అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 22, 2024, 02:47 PM IST
Prabhas: తెలుగు స్టార్ హీరోలకి గుణపాఠం.. డార్లింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!

Kalki 2898AD First Review: ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విడుదల అవుతున్న కల్కి కూడా జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ కూడా వాటిలో చాలా యాక్టివ్ గా పాలు పంచుకుంటున్నారు. అన్ని చోట్లకి తిరుగుతూ ప్రభాస్ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. 

అలా అని కేవలం ఆ ఒక్క సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టకుండా మిగతా సినిమాల పనులతో కూడా ప్రభాస్ బిజీగానే ఉన్నారు. ఒకవైపు హను రాఘవపూడితో చేయాల్సిన సినిమా కోసం ఫోటోషూట్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ వంగా తో సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఇలా సినిమా లవర్స్ కి ప్రభాస్ ని చూడటం ముచ్చటగా ఉంది. 

కానీ మరొకవైపు మిగతా తెలుగు హీరోలు మాత్రం ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఉదాహరణకి మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రకటించి చాలా కాలం అయిపోయింది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే మహేష్ బాబు రెండు మూడేళ్లు గడపనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేవలం గేమ్ చేంజర్ సినిమా తోనే సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఈ సినిమా పూర్తయితేనే బుచ్చిబాబు సనతో సినిమాని ముందుకు తీసుకెళ్లగలరు. ఇలా చూస్తే రామ్ చరణ్ ఒక్కో సినిమాకి రెండేళ్లు కేటాయిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఒక్క సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు దేవర సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ ఆ సినిమాకి సరిగ్గా షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఇంకా సరిగ్గా ప్లాన్ అవ్వలేదు. అసలు ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుందో లేదో కూడా చెప్పడం కష్టమే. 

అల్లు అర్జున్ పుష్ప సినిమా 2021లో విడుదలైంది. మూడేళ్లు అవుతున్నా సినిమాకి రెండవ భాగం అయిన పుష్ప 2 ఇంకా విడుదల కాలేదు. మొదట ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మూడు నెలలు వాయిదా వేసి డిసెంబర్ 6 కి విడుదల అని చెబుతున్నారు. ఇంకా తన నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా క్లారిటీ లేదు. పుష్ప 2 అయిపోయాక ఇంకో సినిమా విడుదల అవ్వాలి అంటే కనీసం 2026 రావాల్సిందే. 
  
ఇలా అనుకున్న సమయానికి సినిమాలని విడుదల చేయలేకపోవడం, ఒక్కో సినిమాకి సంవత్సరాలు సంవత్సరాలు సమయం తీసుకోవడం, వంటివి అభిమానులకు సైతం చిరాకు తెప్పిస్తాయి. ఈ రకంగా ప్రభాస్ మాత్రం అన్ని రకాలుగా ఫ్యాన్స్ ని ఇంప్రెస్స్ చేస్తున్నారు. ప్రభాస్ లాగా కెరియర్ ప్లాన్ చూసి మిగతా తెలుగు స్టార్ హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి అని ఫాన్స్ అంటున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News