Vedhalam Remake: మెగాస్టార్ చిరంజీవి మూవీలో బాలీవుడ్ విలన్ కోసం వేట

బాహుబలి విజయం తరువాత చాలా మంది తెలుగు సినీ తారలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలి అని భావిస్తున్నారు. తెలుగు సినిమాల రుచిమరిగిన బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులు మరిన్ని టాలీవుడ్ చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారని వారు ఆశిస్తున్నారు.

Last Updated : Nov 5, 2020, 04:44 PM IST
    • బాహుబలి విజయం తరువాత చాలా మంది తెలుగు సినీ తారలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలి అని భావిస్తున్నారు.
    • తెలుగు సినిమాల రుచిమరిగిన బాలీవుడ్ ప్రేక్షకులు మరిన్ని టాలీవుడ్ చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారని వారు ఆశిస్తున్నారు.
    • మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం ఇలాంటి ప్లాన్ వేసి ప్యాన్ ఇండియా మూవీలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
Vedhalam Remake: మెగాస్టార్ చిరంజీవి మూవీలో బాలీవుడ్ విలన్ కోసం వేట

బాహుబలి విజయం తరువాత చాలా మంది తెలుగు సినీ తారలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలి అని భావిస్తున్నారు. తెలుగు సినిమాల రుచిమరిగిన బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులు మరిన్ని టాలీవుడ్ చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారని వారు ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం ఇలాంటి ప్లాన్ వేసి ప్యాన్ ఇండియా మూవీలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 

Also Read | Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్

తమిళ చిత్రం వెదలం ( Vedhalam ) రీమేక్ చేయడానికి ఇటీవలే మెగాస్టార్ ( Chiranjeevi ) అంగీకరించిన విషయం తెలిసిందే. సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోన్న మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకుడు. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది అని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ కోసం ఒక బాలీవుడ్ టాప్ నటుడిని వెతుకుతున్నారట మేకర్స్. ఎమోషనల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడిని విలన్ పాత్ర కోసం వెతుకుతున్నారట. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read | Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు స్మగ్లర్ అరెస్ట్

విలన్ పాత్రతో సహా ఇతర ప్రధాన తారగణాన్ని ఎంపిక చేసి త్వరలో షూటింగ్ ప్రారంభించాలని మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అంతా అనుకున్నట్టుగా సాగితే వెదలం సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నాడు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News