Vettaiyan - The Hunter: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ ఎత్తరు నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. .
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ సీనియర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ప్రివ్యూ మొదలవుతోంది. ఈ ఆఫీసర్స్ ఎవరో మీకు తెలుసా.. అని సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) అడుగుతారు. వీళ్లు పేరు మోసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీసర్ సమాధానం చెబుతారు. మన దేశంలో కొన్ని లక్షల మంది పోలీసున్నారు. కానీ వీళ్లని మాత్రం చూడగానే ఎలా గుర్తుపడుతున్నాు. అదెలా సాధ్యం అని మళ్లీ ప్రశ్నవేయగా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మరో లేడీ ఆఫీసర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని ఎలాంటి బెరకు భయం లేకుండా ఎన్‌కౌంటర్స్ చేయటం వల్ల వీళ్లు రియల్ హీరోస్ అయ్యారని ఆన్సర్ చెబుతుంది.
మధ్య మధ్యలో మన హీరో వేట్టయన్ (రజినీకాంత్) తన డ్యూటీలో ఎంత పవర్‌ఫుల్‌గా వ్యవహరించారనేది ఈ ప్రివ్యూలోచూపించారు.అతేకాదు అక్రమార్కులను ఎన్‌కౌంటర్స్ ఎలా చేశారనే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
మనకు ఎస్.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అని నేరస్థులు రజినీకాంత్ పేరు చెబితేనే చుచ్చు పోసుకుంటారు. విలన్స్ వేట్టయన్ పేరు చెబితేనే హడలిపోతుంటారు. డీల్ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని చెబుతుంటారు.
రౌడీయిజం పేరు చెప్పి పబ్లిక్ ను ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్టయన్ వేటాడుతుంటాడని ప్రివ్యూ సన్నివేశాల్లో చూపించి సినిమాపై అంచనాలు పెంచేసారు. చాలా కాలం తర్వాత అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఒక సినిమాలో కనిపించారు. గతంలో ‘గిరఫ్తార్’, ‘హమ్’ సినిమాల తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమా. ఈ సినిమా మరో ముఖ్యపాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఫహాద్ ఫాజిల్, దుసారా విజయన్, అభిరామి, మంజు వారియర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అసలు వీళ్ల పాత్రలకు, వేట్టయన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్టయన్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది తెలియాలంటే ‘వేట్టయన్- ద హంటర్’ సినిమా చూడాల్సిందే.
బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ నాలుగోసారి మ్యూజిక్ అందించారు. రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వేట్టయన్- ద హంటర్’ గా కనిపంచబోతు్నారు.
నటీనటులు:
సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్,రానా దగ్గుబాటి, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ తదితరులు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.