Toofan Trailer: ఘనంగా విజయ్ ఆంటోనీ ‘తుఫాన్’ ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్.. ఈ నెల 26న విడుదల..

Toofan: విజయ్ ఆంటోని.. తమిళ హీరో అయినా.. తెలుగులో మంచి మార్కేట్ ఉంది. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ ‘బిచ్చగాడు 2’ సినిమాతో మంచి హిట్టే అందుకున్నాడు. రీసెంట్ గా ‘లవ్ గురు’ సినిమాతో పలకరించిన విజయ్ ఆంటోని తాజాగా ‘తుఫాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 7, 2024, 09:33 AM IST
Toofan Trailer: ఘనంగా విజయ్ ఆంటోనీ ‘తుఫాన్’ ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్..  ఈ నెల 26న విడుదల..

Toofan: హీరో విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన  లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా జాయింట్ వెంచర్ గా తెరకెక్కిస్తున్నారు.  ఈ బ్యానర్ లో గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సంస్థ నుంచి ‘తుఫాను’ సినిమా రాబోతుంది.  పూర్తి పోయేటిక్ యాక్షన్ జానర్ లో ఈ సినిమా రాబోతుంది.  విజయ్ మిల్టన్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఈ నెల 26వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన "తుఫాన్" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా టీజర్, ట్రైలర్ మీరంతా చూశారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను ఇలా మీ అందరి మధ్యలో గ్రాండ్ గా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.  జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ - "తుఫాన్"  సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాకు ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన హీరోకు, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు.  భాష్యశ్రీ "తుఫాన్"  అందించిన సంభాషణలు చూస్తుంటే..స్ట్రైయిట్ తెలుగు సినిమా అనేంత బాగా రచన చేశారని కొనియాడారు.

హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ - మా "తుఫాన్"  మూవీ టీమ్ మీద  ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.  

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..
తెలుగులో మీరు చూపిస్తున్న అభిమానానికి ఎంత రుణం ఇచ్చిన తీర్చుకోలేనిది. మీతో కలిసి సినిమా చూడాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇచ్చిన దర్శకుడు విజయ్ మిల్టన్ తో పాటు నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

Read more: Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News