Happy Birthday Vijay Deverakonda: సమంత, పేరెంట్స్‌తో రౌడీ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్...

Happy Birthday Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇవాళ తన 33వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. విజయ్ బర్త్ డేని హీరోయిన్ సమంత, దర్శకుడు శివ నిర్వాణ, పేరెంట్స్ కలిసి సెలబ్రేట్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 09:57 AM IST
  • రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే
  • సమంత, శివ నిర్వాణ, పేరెంట్స్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు
Happy Birthday Vijay Deverakonda: సమంత, పేరెంట్స్‌తో రౌడీ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్...

Happy Birthday Vijay Deverakonda: ఇవాళ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే. ఇవాళ్టితో విజయ్ 33వ వడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటివరకూ సోలో హీరోగా కొద్ది సినిమాలే చేసినా... తెలుగుతో పాటు హిందీ సహా ఇతర భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించకముందే ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అటు సినిమాలతో.. ఇటు తన రెబల్ యాటిట్యూడ్‌తో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. విజయ్ పుట్టిన రోజు వేళ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో విషెస్ తెలియజేశారు. 'నేను నీలోని ఫైర్‌ని చూశాను... నీలోని మంచి నటుడిని చూశాను... నీ మనస్సులో ఏం మెదులుతుందో నాకు తెలుసు... నీ తపన, నీ పిచ్చి, నీ నిబద్దత, నీ వినయం... ఇవన్నీ నిన్ను ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. ఏదో ఒకరోజు నువ్వు దేశం గర్వించే స్థాయికి వెళ్తావు. ఇప్పటికైతే నిన్ను 'ది విజయ్ దేవరకొండ' అంటాను. హ్యాపీ బర్త్ డే...' అంటూ తనదైన స్టైల్లో విషెస్ చెప్పారు పూరి. హీరోయిన్ సమంత సహా పలువురు నటీనటులు విజయ్‌కి విషెస్ తెలియజేశారు.

ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోలతో రౌడీ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ టీమ్ కూడా విజయ్ బర్త్ డేని సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ, హీరోయిన్ సమంత, తన పేరెంట్స్‌తో కలిసి విజయ్ బర్త్ డే జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే... ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ హంట్ పేరిట మూవీ బీజీఎం ట్రాక్‌ను విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లైగర్ విడుదల కాకముందే విజయ్, పూరి కలిసి 'జన గణ మన' ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి లవ్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. 

Also Read: Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!

Also Read: Priyanka Chopra Daughter: ఎట్టకేలకు తమ కూతురి ఫోటో రివీల్ చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉన్న పాపాయి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News