Vishal Saamanyudu Trailer: 'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్.. డైలాగ్స్‌, యాక్షన్ తో అదరగొట్టిన విశాల్..

Saamanyudu Trailer: తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న సామాన్యుడు ట్రైలర్ రిలీజ్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 08:37 AM IST
  • సామాన్యుడు ట్రైలర్ రిలీజ్
  • అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న విశాల్
Vishal Saamanyudu Trailer: 'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్.. డైలాగ్స్‌, యాక్షన్ తో అదరగొట్టిన విశాల్..

Vishal Saamanyudu Trailer: విభిన్న కథాచిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. ఈ హీరోకు కోలీవుడ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఉంది. గతంలో విశాల్ (Hero Vishal) నటించిన చిత్రాలు తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఈ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'సామాన్యుడు' (Saamanyudu). ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్‌. శరవణన్ దర్శకుడు.  యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతమందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను (Saamanyudu Trailer) విడుదల చేశారు మేకర్స్. 

ట్రైలర్ ఓపెన్ చేస్తే...‘''ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒకదానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్‌కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను''’ అనే డైలాగ్ సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతుంది.

Also Read: Varun Tej Ghani: వరుణ్​తేజ్ బర్త్​డే...'పవర్​ ఆఫ్ గని' పేరుతో సర్​ప్రైజ్​ వీడియో

ఈ సినిమాలో విశాల్ కు జంటగా డింపుల్ హయాతి (Dimple Hayathi) నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ, కెమిస్ట్రీ యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. అద్బుతమైన డైలాగ్స్‌, పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫామెన్స్‌తో విశాల్ (Vishal) కేక పెట్టించాడు. ఈ సినిమా ట్రైలర్‏కు యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో కూడా ఈ ట్రైలర్‏కు ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News