Kannappa Comic Book: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్.. ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల

Mohan Babu Birthday Special: మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల చేశారు. భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ బుక్‌ను తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ పుసక్తాలను ఉచితంగా అందించనున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 20, 2024, 04:56 PM IST
Kannappa Comic Book: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్.. ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల

Mohan Babu Birthday Special: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్‌ను ఆవిష్కరించాడు విష్ణు మంచు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న "కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1"ని లాంచ్ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

Also Read: Kavitha Arrest: కవితను అరెస్ట్‌ చేసి.. కేటీఆర్‌కు చుక్కలు చూపించిన ఈడీ అధికారిణి ఎవరో తెలుసా? ఆమె జీవిత చరిత్ర ఇదే!

"కన్నప్ప కామిక్ బుక్ వాల్యూమ్ 1" ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక  భావనలను చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు.

"కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1" విడుదల అనేది భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మాత్రమే కాకుండా, కన్నప్ప కథపై విష్ణు మంచు నిబద్ధతను కూడా ప్రదర్శించింది. ఇన్ స్టాగ్రాంలో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసెజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి.

ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం.. సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అద్భుతమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. 

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. డాక్టర్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు, మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు డా.మోహన్‌లాల్ గారు గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు.

Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News