Vishwambhara: విశ్వంభరలో మరో మెగా హీరో.. ఒక్క విజయం కోసం బోలెడు హడావిడి!

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీని మెగాస్టార్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుతున్నారు చిరంజీవి. అయితే ఈ మధ్య మాత్రం ఈ హీరోకి అనుకున్న స్థాయిలో విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో చిరంజీవి తన ఆశలు అన్నీ విశ్వంభర సినిమా పైన పెట్టుకున్నాడు…

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 8, 2024, 08:42 PM IST
Vishwambhara: విశ్వంభరలో మరో మెగా హీరో.. ఒక్క విజయం కోసం బోలెడు హడావిడి!

Vishwambhara Update: చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ముఖ్యంగా ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ.. అపజయాలు అందుకుంటున్నారు ఈ హీరో. సొంత కథతో ఈ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి.. ఒక మోస్టారు విజయం సాధించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచిగా కలెక్షన్ సాధించిన.. ఈ సినిమా కూడా కథపరంగా ఎన్నో విమర్శలను అందుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిరంజీవి సీనియర్ హీరోలు అందరికన్నా వెనుకబడి ఉన్నారు.

ఒకపక్క బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతుండగా.. మరోపక్క చిరంజీవి కథలు మాత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి విమర్శలు తెచ్చుకుంటున్నాయి. అందుకే చిరంజీవి ప్రస్తుతం తన ఆశలన్నీ విశ్వంభర చిత్రంపై పెట్టుకున్నారు. బింబిసారా లాంటి సినిమా తీసిన యువ దర్శకుడు వశిష్ట తో ఈ చిత్రం తీస్తున్నారు చిరంజీవి. ఈ క్రమంలో ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని.. మన చిరు గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అందుకే ఈ సినిమా విజయం కోసం ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు.

విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఎంతోమంది యువ హీరో, హీరోయిన్లను కూడా తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి చెల్లెలుగా నలుగురు పేరున్న హీరోయిన్స్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్..కనిపిస్తున్నారు అని కూడా రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రంలో మెగా కాంపౌండ్ హీరో కూడా కనిపించనున్నారట. వరస డిజాస్టర్స్ తో ఫ్లాప్ హీరోగా రికార్డ్లు అందుకుంటున్న వైష్ణవ తేజ్ .. ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించనున్నారట.ఇందులో అతడి రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. ఇక త్వరలోనే ఈ మెగా కాంపౌండ్ హీరో షూట్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. 

అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ పెట్టనంత బడ్జెట్‌ను ఈ సినిమాకి పెడుతున్నారు. మరి ఈ చిత్రంతో అన్న మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ తేజ్.. అలానే మన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తారో లేదో చూడాలి.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News