షారుఖ్ ఖాన్ 'జీరో' టీజర్: మరుగుజ్జు మనిషిగా బాద్‌షా

హీరోగా ఎన్నో రొమాంటిక్, యాక్షన్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు 'జీరో'గా ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు.

Last Updated : Jan 2, 2018, 12:46 PM IST
షారుఖ్ ఖాన్ 'జీరో' టీజర్: మరుగుజ్జు మనిషిగా బాద్‌షా

హీరోగా ఎన్నో రొమాంటిక్, యాక్షన్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు 'జీరో'గా ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. జీరో అనగానే మా హీరో షారుఖ్ ఖాన్ జీరో ఎందుకు అవుతాడని అతడి అభిమానులకి ఆగ్రహం వస్తుందేమో..! కానీ ఇక్కడ జీరో అంటే అతడు జీరో అని కాదండోయ్.. అది అతడి కొత్త సినిమా పేరు. అవును, జనవరి 1 సందర్భంగా ఇవాళే తన తర్వాతి సినిమా టైటిల్‌ని, టీజర్‌ని విడుదల చేశాడు షారుఖ్.

మొట్ట మొదటిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో నటిస్తున్న షారుఖ్.. ఈ సినిమాలో ఓ మరుగుజ్జు మనిషి పాత్ర పోషిస్తున్నాడు. మరుగుజ్జు పాత్రలో షారుఖ్ వేసిన స్టెప్పులు చూస్తే, జీరో టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పొచ్చు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం భారీగానే వున్నాయని తెలుస్తోంది. 

 <

>

షారుఖ్ ఖాన్ సరసన అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఓ మరుగుజ్జు జీవితంలో జరిగే ఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశం. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజనా లాంటి సినిమాలని తెరకెక్కించిన ఆనంద్ ఎల్ రాయ్ ఈ జీరో సినిమాతో షారుఖ్ ఫ్యాన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేయనున్నాడో వేచిచూడాల్సిందే.  

Trending News