School bus accident : స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడిన దుర్ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు.

Updated: Jan 27, 2020, 06:57 PM IST
School bus accident : స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

మదురై: స్కూల్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడిన దుర్ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.