close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తెరపై దుమ్ము రేపుతున్న 'ABCD' ;  మూవీ రివ్యూ మీ కోసం...

అల్లు శిరీష్ హీరోగా నటించిన ABCD మూవీ జబర్దస్త్ కామిడీతో తెరపై దుమ్ము రేపుతోంది.

Updated: May 17, 2019, 02:56 PM IST
తెరపై దుమ్ము రేపుతున్న 'ABCD' ;  మూవీ రివ్యూ మీ కోసం...

నటీనటులు      : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, నాగబాబు, రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం           : జుధా సాంధీ
సహా నిర్మాత     : ధీరజ్ మొగిలినేని
సమర్పణ         : డి. సురేష్ బాబు
నిర్మాణం          : మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు       : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
దర్శకత్వం       : సంజీవ్ రెడ్డి
విడుదల తేది   : 17 మే 2019
 
‘ఒక్క క్షణం’ తర్వాత రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు శిరీష్. మళయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ABCD ఈరోజే రిలీజైంది. సంజీవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ మరో హిట్టు అందుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.
కథ :
న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.

అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :
అల్లు శిరీష్ పర్ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్ తో మెప్పించాడు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు అల్లు శిరీష్ మాత్రమే ఈ పాత్ర చేయగలడని ఎందుకు అన్నారో సినిమా చూస్తే అర్థమౌతుంది. రిచ్ కిడ్ గా, స్లమ్ లో కనిపించే ఆర్డినరీ అబ్బాయిగా రెండు వేరియేషన్స్ లో అల్లు శిరీష్ బాగా చేశాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో శిరీష్ కామెడీ టైమింగ్ బాగా ఎలివేట్ అయింది.

హీరో తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ భరత్ ది. బాలనటుడిగా ఇప్పటికే బోలెడంత కామెడీ పండించిన భరత్, హీరో స్నేహితుడు కమ్ బంధువుగా సినిమా మొత్తం శిరీష్ పక్కన కనిపిస్తాడు. హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు ఇతడొక్కడు మాత్రమే. ఇక రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టరే కావడంతో రుక్సార్ జస్ట్ పరవాలేదనిపించుకుంది.

సాఫ్ట్ క్యారెక్టర్స్ తో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న రాజా విలన్ గా పరవాలేదనిపించాడు. కాకపోతే విలనిజం పండించడంలో ఇంకా నైపుణ్యం పొందాలి. కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకునే మిలియనీర్ క్యారెక్టర్ లో నాగబాబు నటన బాగుంది.  న్యూస్ ప్రెజెంటర్ గా వెన్నెల కిషోర్ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పొలిటికల్ క్యారెక్టర్స్ తో కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులంతా వారి పరిధిలో నటించి క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు మెయిన్ హైలైట్ జుదా సాందీ మ్యూజిక్. ఫ్రెష్ ట్యూన్స్ తో ఎట్రాక్ట్ చేసాడు ఈ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్. రిలీజ్ కి ముందే అందరినీ ఎట్రాక్ట్ చేసి 25 మిలినియన్ వ్యూస్ సాధించిన మెల్లమెల్లగా సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సాంగ్ కి కొరియోగ్రఫీ బాగుంది. కథలో భాగంగా వచ్చే మిగతా పాటలు కూడా బాగున్నాయి. కొన్ని సన్నివేశాలకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. అక్కడక్కడా వచ్చే కామెడీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా సంజీవ్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కానీ తన అనుభవంతో కొన్ని సన్నివేశాలను బాగానే డీల్ చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు.

సమీక్ష
రీమేక్స్ తీయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. కొందరు హిట్ అయిన సినిమాను యాజ్ ఇటీజ్ తీస్తారు. మరికొందరు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మార్పులు చేసి హిట్ కొడతారు. ABCD దర్శకుడు సంజీవ్ రెడ్డి రెండో టైపు. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాడు ఈ దర్శకుడు. కొన్ని సీన్స్ మాత్రమే రిపీట్ చేశారు. మిగతా నెరేషన్ మొత్తం రీ-రైట్ చేసుకున్నారు. ఈ ఎఫర్ట్ ABCDలో స్పష్టంగా కనిపించింది.

హీరోయిన్ లవ్ ట్రాక్ ఒరిజినల్ వెర్షన్ లో ఇంత డీటెయిల్డ్ గా  ఉండదు. తెలుగు ఆడియన్స్ కోసం చేసిన ఆ మార్పు మెప్పిస్తుంది. ఇంతకంటే హైలెట్ పాయింట్ ఏంటంటే.. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్. ఒరిజినల్ వెర్షన్ లో అసలు ఈ ట్రాక్ లేదు. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో హిలేరియస్ గా నవ్వించిన ఓ రియల్ టీవీ యాంకర్ ఎపిసోడ్ కు స్పూఫ్ గా వెన్నెల కిషోర్ ట్రాక్ రాసుకున్నారు. సినిమాకు ఈ కామెడీ పెద్ద హైలెట్.

దీంతో పాటు అల్లు శిరీష్, భరత్ కాంబినేషన్ లో సీన్స్ బాగా వచ్చాయి. సినిమా సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతుందనుకున్న ప్రతిసారి, దర్శకుడు ఎంటర్ టైన్ మెంట్ దారి చూపించాడు. అందుకే సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ కాలక్షేపం అయిపోతుంది. దీనికి తోడు సెకండాఫ్ లో వచ్చిన సూపర్ హిట్ “మెల్లమెల్లగా…” సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంది.

ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు “ఓన్లీ వినోదం” అనే తరహాలో సాగిపోతుంది ABCD. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పటికీ, థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ ఎమోషనల్ కంటెంట్ కంటే కామెడీ ట్రాకే ఎక్కువగా గుర్తొస్తుంది. సినిమాకు అతిపెద్ద పాజిటివ్ ఎలిమెంట్ తో పాటు, మైనస్ పాయింట్ కూడా ఇదే.

కామెడీకి స్కోప్ ఉన్న కథ కావడంతో ఎక్కువ భాగం దాని మీదే శ్రద్ధ పెట్టారు. అలా కాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టి ఉన్నట్టయితే ప్రేక్షకులకు ఇంకా కనెక్ట్ అయ్యేది. ఒక మిలియనీర్ కొడుకు అమెరికా నుండి ఇండియా వచ్చి ఇబ్బందులు పడే పాయింట్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఆ కథను అందరూ ఓన్ చేసుకునేలా క్రియేట్ చేయగలగాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఫన్ తో పాటు, ఫ్రస్ట్రేషన్ ను కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు.

ఓవరాల్ గా ఈ వీకెండ్ ఓ ఫన్ మూవీని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ABCD బెస్ట్ ఆప్షన్.
 

రేటింగ్ : 2.75/5

 

 

 

 

@ జీ సినిమాలు

Tags: