దేశంలోనే అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహం మార్చి 9వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి దేశంలోని ప్రముఖులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరౌతున్నారు.
పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వివాహానికి సంబంధించిన శుభలేఖ సిద్ధమైంది. ఒక్కో శుభలేఖకు ఏకంగా 1.5 లక్షలు వెచ్చించడం గమనార్హం . బోర్డ్ గేమ్ సైజులో బాక్స్, యానిమేటెడ్ రొటేటింగ్ డిస్క్, తాకగానే వెలిగే లైట్లు, శ్రీకృష్ణ, రాధల చిత్రం, వినాయకుడి ఎంబోజింగ్ ప్రతిమ ..ఇలా వెడ్డింగ్ కార్డు ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇలాంటి వెడ్డింగ్ కార్డు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ కు గురవ్వాల్సిందే . ఈ వెడ్డింగ్ కార్డును చూసి మీరు ఎంజాయ్ చేయండి.
Akash Ambani and Shloka Mehta's wedding card pic.twitter.com/1vV7ZrHTji
— Priyarag Verma (@priyarag) February 13, 2019