allu arjun new film title : అల్లు అర్జున్- సుకుమార్ సినిమా టైటిల్ అది కాదట ..!!

'అల వైకుంఠపురములో'.. బంపర్ హిట్ కావడంతో ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఐతే బన్నీ తర్వాతి సినిమా ఏంటి..? ఎలా ఉండబోతోంది..? అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. 

Last Updated : Jan 20, 2020, 04:59 PM IST
allu arjun new film title : అల్లు అర్జున్- సుకుమార్ సినిమా టైటిల్ అది కాదట ..!!

'అల వైకుంఠపురములో'.. బంపర్ హిట్ కావడంతో ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఐతే బన్నీ తర్వాతి సినిమా ఏంటి..? ఎలా ఉండబోతోంది..? అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఆర్య, ఆర్య-2, రంగస్థలం దర్శకుడు సుకుమార్‌తో అల్లు అర్జున్ తర్వాతి సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు దాదాపు అంతా రెడీగా ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య సినిమా అనే సరికి ఫ్యాన్స్‌తోపాటు, సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ఐతే అల్లు ఫ్యాన్స్ ఉత్సాహం మరింత రెట్టింపైంది. 
తమ అభిమాన కథానాయకుడు త్వరలో నటించబోయే సినిమాకు టైటిల్ కూడా వారే ఖరారు చేసేశారు. సుకుమార్ , బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'శేషాచలం' అంటూ సినిమా పోస్టర్ సైతం డిజైన్ చేసేశారు. ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.  సినిమా .. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది.. కాబట్టి వారు ఆ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ నిజమే అనుకుని చాలా మంది ఇదే టైటిల్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.

సినిమా టైటిల్ అది కాదు
ఐతే సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా బన్నీ సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేయలేదని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ కూడా ఖరారు కాలేదని తెలిపాయి. సోషల్ మీడియాలో వస్తున్న టైటిల్‌కు సినిమాకు సంబంధం లేదంటున్నారు . మొత్తంగా అల్లు ఫ్యాన్స్ చేసిన పని సెన్సేషన్ సృష్టిస్తోంది. ఐతే టైటిల్ ఖరారు చేసిన తర్వాతా అధికారికంగా ప్రకటిస్తామని చిత్రం యూనిట్ తెలపడం కొసమెరుపు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News