సంక్రాంతి కానుకగా అరవింద సమేత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

సంక్రాంతి కానుకగా అరవింద సమేత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Last Updated : Jan 13, 2019, 05:44 PM IST
సంక్రాంతి కానుకగా అరవింద సమేత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత వెండి తరపై కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ దర్శకత్వం, ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే జంటగా నటించింది. అప్పుడు వెండితెరపై రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇవాళ బుల్లితెరపై సందడి చేసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తోంది. వినోదాత్మక చలన చిత్రాలు, సీరియల్స్, టీవీ షోలతో అలరిస్తోన్న మీ అభిమాన ఛానెల్ జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు అరవింద సమేత చిత్రాన్ని ప్రసారం చేయబోతున్నారు. 

Also read : అరవింద సమేత ఆడియో జ్యూక్ బాక్స్ వచ్చేసిందోచ్

రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే డైలాగ్స్, మళ్లీ మళ్లీ వినాలనిపించే వినసొంపైన పాటలకు తోడు ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసినట్టుండే బ్యాగ్రౌండ్ స్కోర్ అరవింద సమేత సినిమా సొంతం. కథలో భాగంగా సాగిపోయే 'రారా పెనివిటి', 'ఏ కోనలో కూలినాడో..', రెడ్డి ఇక్కడ సూడు, అనగనగా ఒక అరవిందట వంటి పాటలన్నీ సూపర్ హిట్ అవడమే కాకుండా 2018 మ్యూజిక్ హిట్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇంకెందుకు ఆలస్యం మరి.. ఎంజాయ్ ది షో..

 

Trending News