అత్తారింటికి దారేది తమిళ రీమేక్ టీజర్ వచ్చేసింది

అత్తారింటికి దారేది తమిళ రీమేక్ టీజర్

Updated: Dec 1, 2018, 04:40 PM IST
అత్తారింటికి దారేది తమిళ రీమేక్ టీజర్ వచ్చేసింది
Source : Youtube@Lyca Productions

తెలుగునాట పవర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్ కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రం టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం తమిళ స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో ప‌వ‌న్ కల్యాణ్ పోషించిన పాత్ర‌లో అక్కడి స్టార్ హీరో శింబు నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ అనే టైటిల్ ఖరారు చేశారు. సమంత, ప్రణీత సుభాష్ పాత్రల్లో మెఘా ఆకాశ్, కేథరిన్ ట్రెసా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.