Maruti WagonR CNG: అతి చవకగా మారుతి వ్యాగన్ ఆర్.. ధర కేవలం రూ. 80 వేలే!.. మైలేజ్ కూడా ఎక్కువే!

Maruti WagonR CNG on Road Price: మన దేశంలో మారుతి సుజకి కార్లకు ఉన్న క్రేజ్ వేరు. ఈ బ్రాండ్ కు ఉన్న వాల్యూ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మారుతీ వ్యాగన్ సీఎన్జీతో వచ్చింది. దీనిని మీరు లక్ష రూపాయల లోపే సొంతం చేసుకోవచ్చు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 07:54 PM IST
Maruti WagonR CNG: అతి చవకగా మారుతి వ్యాగన్ ఆర్.. ధర కేవలం రూ. 80 వేలే!.. మైలేజ్ కూడా ఎక్కువే!

Get Maruti WagonR CNG with Rs 80,000: మన దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఒకటి. ఏళ్లు గడిచినా దీనికి ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ప్రస్తుతం మారుతీ వ్యాగన్ సీఎన్జీతో వస్తుంది. అంతేకాకుండా ఇది త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 58 bhp మరియు 78 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 34 కిమీ మైలేజీని ఇస్తుంది. దీనిని మీరు కేవలం రూ.80 వేలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ నాలుగు వేరియంట్లో లభిస్తుంది. LXi, VXi, ZXi మరియు ZXi+. దీని ధర రూ. 5.54 లక్షల నుండి రూ. 7.42 లక్షల మధ్య ఉంటుంది. LXi మరియు VXi మోడల్స్ లో మాత్రమే సీఎన్జీని అమర్చారు. LXi CNG ధర రూ.6.45 లక్షలు. మీరు ఈ కారును లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే రూ. 80 వేలు చెల్లిస్తే సరిపోతుంది. లోన్ కాల వ్యవధి తీరేసరికి మీరు రూ. 7.26 లక్షలు చెల్లిస్తారు. అయితే బ్యాంకుల్లో వడ్డీ రేటు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా లోన్ కాలపరిమితి 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. 

ఉదాహరణకు రూ. 80,000 (20%), వడ్డీ రేటు 9% మరియు 5 సంవత్సరాల రుణ కాలవ్యవధిని మనం ఊహించుకుందాం. దీనికి మీరు ప్రతి నెలా రూ. 13,425 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు మొత్తం లోన్ మొత్తానికి (రూ. 6.46 లక్షలు) అదనంగా రూ. 1.58 లక్షలు చెల్లిస్తారు.

Also Read: Best Selling Cars: ఆ రెండు మారుతి కార్లను వెనక్కి నెట్టేసిన బలేనో, ధర, ఫీచర్ల వివరాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News