ఎన్టీఆర్‌ బయోపిక్‌కు బాలయ్య దర్శకత్వం?

నందమూరి తారక రామారావు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'.

Last Updated : Apr 29, 2018, 05:14 PM IST
ఎన్టీఆర్‌ బయోపిక్‌కు బాలయ్య దర్శకత్వం?

నందమూరి తారక రామారావు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'. ఈ మూవీలో ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే అంశంపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, క్రిష్, కృష్ణవంశీ పేర్లు వినిపించాయి. తాజాగా బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జోరందుకుంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీపదకూడదని నిర్ణయించుకున్నారట బాలయ్య.

గతంలో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల పేరుతో ఓ చిత్రం ప్రారంభం కాగా సౌందర్య మరణంతో ఆ మూవీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ మరోమారు దర్శకత్వంవైపు దృష్టిసారించడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే..!

Trending News