తమిళ డైరక్టర్ల సంఘం అధ్యక్ష పదవికి భారతీరాజా రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన ఓ లెటర్ ను ఆయన రిలీజ్ చేశారు. దర్శకుల సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెల ఈ ప్రక్రియ మొదలైంది.
నామినేషన్ల ప్రక్రియ సమయంలోనే అధ్యక్ష పదవికి భారతీరాజాను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మిగిలిన పదవులకు జులై14న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలనే ఆకాంక్షతోనే తాను పదవికి రాజీనామా చేశానని భారతీరాజా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భారతీరాజా తాజా నిర్ణయంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈనెల 14న ఇతర పదవులకు ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్ష పదవికి కూడా అదే రోజున ఎన్నికలు జరిగుతాయా లేక ఈ పదవి కోసం మరోసారి ఎన్నికల ప్రక్రియ సాగేనా అన్నది తెలియాల్సి ఉంది.