ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో కీలక పాత్ర పోషిస్తున్న మెగాస్టార్

జూనియర్ ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'.

Updated: Sep 11, 2018, 04:59 PM IST
ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో కీలక పాత్ర పోషిస్తున్న మెగాస్టార్

జూనియర్ ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెల 20న 'అరవింద సమేత 'ఆడియోని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ని కూడా బుక్ చేయనున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారట. అంతేకాదు ఆయన హైదరాబాద్‌లో జరిగే ఆడియో కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారని తెలిసింది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమాల మీద దృష్టి పెట్టారు. గతంలో మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బిగ్‌బీ ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు. తాజాగా అరవింద సమేతలో కూడా అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ బాలకృష్ణ  ఆడియో ఫంక్షన్‌లకి చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని సామాజిక మాధ్యమాల్లో చక్కట్లు కొట్టింది. తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించే ఆడియో వేడుకకు బిగ్‌బి ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ అమితాబ్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు.. అందుకు బిగ్‌బి ఒప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  కాగా.. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11వ తేదిన విడుద‌ల కానుంది.