Darbar telugu trailer | టాప్ ట్రెండింగ్‌లో దర్బార్ ట్రైలర్

దర్బార్ ట్రైలర్(Darbar telugu trailer) అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. దర్బార్ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు అంచనాలకు తగినట్టుగానే దర్బార్ ట్రైలర్ తలైవా ఫ్యాన్స్‌ని సూపర్ ఎంటర్‌టైన్ చేస్తోంది.

Last Updated : Dec 17, 2019, 02:05 PM IST
Darbar telugu trailer | టాప్ ట్రెండింగ్‌లో దర్బార్ ట్రైలర్

ఐయామ్ ఏ బ్యాడ్ కాప్..  అంటూ రిలీజైన తలైవా కొత్త మూవీ దర్బార్ ట్రైలర్(Darbar telugu trailer) అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. దర్బార్ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు అంచనాలకు తగినట్టుగానే దర్బార్ ట్రైలర్ తలైవా ఫ్యాన్స్‌ని సూపర్ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇదివరకే విడుదలైన దర్బార్ పాట, టీజర్‌కి భారీ స్పందన కనిపించగా తాజాగా ట్రైలర్‌కి సైతం అదేస్థాయిలో రెస్పాన్స్ కనిపిస్తోంది. దర్బార్ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth`s role in Darbar) ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రను పోషిస్తున్నారు. పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్.. వీ లివ్ టు ప్రొటెక్ట్ .. వీ డై టు సర్వ్.. అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతే కాదు స్టైల్‌కు పెట్టింది పేరైన తలైవా... తన సూపర్ స్టైల్స్‌ను సినిమాలో ప్రదర్శించారు. గజినీ చిత్ర దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ షెట్టి(Sunil Shetty`s role in Darbar) ప్రతి నాయకుని పాత్ర పోషిస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తా అంటున్న రజినీకాంత్.. 
సూపర్ స్టార్ రజినీకాంత్ 27 సంవత్సరాల తర్వాత పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. నిజానికి పోలీస్ పాత్ర అంటే తనకు ఇష్టం లేదని రజనీ కాంత్ తెలిపారు. ఐతే  మంచి కథతో ఏ.ఆర్ మురుగదాస్ వచ్చారని.. అందుకే పోలీస్ పాత్రను ఒప్పుకున్నట్లు తలైవా చెప్పారు. తనకు ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలని ఉందనే కోరికను రజినీకాంత్ బయటపెట్టారు. ఇక ముందు ఎవరైనా నిర్మాతలు వస్తే అలాంటి పాత్ర చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

Trending News