LGM Movie: రిలీజ్‌కు LGM సిద్ధం.. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ మూవీపై భారీ అంచనాలు

Dhoni Family Entertainer: ర‌మేష్ త‌మిళ్ మ‌ణి  డైరెక్షన్‌లో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందించిన మూవీ LGM. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 20, 2023, 03:50 PM IST
LGM Movie: రిలీజ్‌కు LGM సిద్ధం.. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ మూవీపై భారీ అంచనాలు

Dhoni Family Entertainer: టీమిండియా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సినీ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు మిస్టర్ కూల్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై LGM సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా రూపొందుతుండగా.. తెలుగులోనూ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో పూర్తిగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిస్తున్నారు. సాక్షి ధోని ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

LGM షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను.. సాంగ్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఎంఎస్ ధోని, సాక్షి ధోని హాజరుకానున్నారు. డైరెక్టర్ ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ.. కుటుంబం అంతా కలిసి చూసే విధంగా LGM మూవీని రూపొందించినట్లు తెలిపారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దామని చెప్పారు. ఆద్యంతం నవ్విస్తూనే.. ఆడియన్స్ మనసులను తాకుందని పేర్కొన్నారు. LGM చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆదరించాలని కోరారు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన LGM టీజర్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. ర‌మేష్ త‌మిళ్ మ‌ణి డైరెక్షన్‌తోపాటు మ్యూజిక్‌ను కూడా అందించడం విశేషం. యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తొలి మూవీ రిలీజ్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..  

Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News