close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ ఇవే

డైట్ అనేది ఆహారపు అలవాట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి డైట్ అనేది మంచి ఆరోగ్యానికి ఎప్పుడూ తోడ్పాటునిస్తుంది. వీలును బట్టి డైట్‌లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, సినిమా నటులు డైట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ క్రమంలో మనం కూడా పలువురు బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ తెలుసుకుందామా..!

Updated: Jul 29, 2018, 09:47 PM IST
బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ ఇవే

డైట్ అనేది ఆహారపు అలవాట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి డైట్ అనేది మంచి ఆరోగ్యానికి ఎప్పుడూ తోడ్పాటునిస్తుంది. వీలును బట్టి డైట్‌లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, సినిమా నటులు డైట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ క్రమంలో మనం కూడా పలువురు బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ తెలుసుకుందామా..!

హృతిక్ రోషన్ - బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తీసుకొనే ఉదయం పూట డైట్‌లో 100 గ్రాముల చికెన్, కొన్ని స్ప్రౌట్స్, బ్రకోలి, స్పినాచ్‌తో పాటు ఓ కప్పు రైస్ ఉంటుందట. ఈ డైట్ తీసుకున్న తర్వాత ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం గానీ.. కోడి గ్రుడ్లు తినడం గానీ చేస్తారట. తన బరువును కంట్రోల్ చేయడానికి తాను ఈ డైట్ తీసుకుంటూ ఉంటారట. 

నర్గీస్ ఫక్రీ - హిందీ నటి నర్గీస్ ఫక్రీ తన బరువు తగ్గించుకోవడం కోసం ప్రతీ రోజు ఆహారాన్ని కొంచెం తగ్గించి.. ఎక్కువగా ద్రవ పదార్థాలపైన... జ్యూస్‌ల పైనా ఆధారపడేవారట. ఆమె పాటించిన ఈ "జ్యూస్ క్లీనీస్ డైట్" ఎంతో పాపులర్ అయింది. స్పై అనే హాలీవుడ్ సినిమాకి స్టంట్స్ చేస్తున్నప్పుడు ఆమె ఈ డైట్ పాటించారు. 

మల్లికా షెరావత్ - ఈమె డైట్ పూర్తిగా వేగన్ ఫార్ములాతో ఉంటుంది. ఈమె డైట్‌లో ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఉండవట. అలాగే పాలు, పెరుగు, మజ్జిగ కూడా ఈమె తాగరట. ప్రతీ రోజు ఈమె ఉదయం తీసుకొనే డైట్‌లో పలు పండ్లు, క్యారట్, ముల్లంగి వంటి కాయగూరలతో పాటు ఆకుకూరలతో చేసిన రసం ఉంటుందట. 

బిపాసా బసు - బాలీవుడ్ నటి బిపాసా బసు తీసుకొనే డైట్‌లో ఆకు కూరలు, కొంచెం చికెన్, పప్పు దినుసులు, చేపలు, స్ప్రౌట్స్ ఉంటాయట. ఈ డైట్ తీసుకోవడంతో పాటు ఆమె రెగ్యులర్‌గా యోగా చేస్తారట. అలాగే ప్రతీ రోజు సాధ్యమైనంత ఎక్కువ నీరు, పానీయాలు తాగడం అనేది ఈమె డైట్‌లో ఒక భాగమని చెప్పుకోవచ్చు.

అలియా భట్ - ఈమె రెగ్యులర్‌గా వ్యాయామం చేయడంతో పాటు ప్రతీ రోజు తప్పనిసరిగా ఉదయం 8 గంటలకు ముందే బ్రేక్ ఫాస్ట్ చేస్తుందట. అలాగే ప్రతీ రెండు, మూడు గంటలకు ఏదో ఒకటి తింటుందట. ఈమె డైట్‌లో ఎక్కువగా పళ్ల రసాలు ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుందట.