శ్రీదేవి డెడ్ బాడీ అప్పగింతకు దూబాయ్ ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్

శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె బంధువులకు అప్పగించేందుకు దుబాయ్ ప్రభుత్వం అప్పగించింది.

Last Updated : Feb 27, 2018, 04:11 PM IST
శ్రీదేవి డెడ్ బాడీ అప్పగింతకు దూబాయ్ ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు దూబాయ్ ప్రభుత్వం కరుణించింది. శ్రీదేవీ డెడ్ బాడీ అప్పగించేందుకు ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీదేవి భౌతికకాయం అప్పగింత కు సంబంధించిన ఓ లేఖను దుబాయ్ పోలీసులకు అందించింది. దీంతో వారు శ్రీదేవి పార్థిదేహాన్ని ముంబై తరలించేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు.  ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు, ఇండియన్ కాన్సులేట్ కు లేఖలు అందాయి.  

శ్రీదేవి మృతి చెంది మూడు రోజులు అవుతున్న నేపథ్యంలో ఆమె డెడ్ బాడీ పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ కు పంపారు.ఎంబామింగ్ కు కనీసం మూడు గంటలు పట్టవచ్చు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆమె  మృతి దేహాన్ని ప్రత్యేక విమనాంలో ముంబైకి తీసుకువస్తారు. ఈ రాత్రి కల్లా శ్రీదేవి డెడ్ బాడీని ముంబై తీసుకువచ్చే అవకాశముంది...

దుబాయ్ ప్రాసిక్యూషన్ నిర్ణయంతో రీపోస్టుమార్టం లేనట్లే తేలిపోయింది. కాగా శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ ప్రముఖులు,అభిమానులు పెద్ద సంఖ్యలో ముంబైకి చేరుకుంటున్నారు.

Trending News