రికార్డు స్టాయిలో F2 వసూళ్లు ; సంక్రాంతి రేసులో విన్నర్

100 % కామెడీ మూవీ F 2 ను చూస్తూ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Last Updated : Jan 26, 2019, 10:26 AM IST
రికార్డు స్టాయిలో F2 వసూళ్లు ; సంక్రాంతి రేసులో విన్నర్

సంక్రాంతి సందర్భంలో విడుదలైన F2 వసూళ్లు మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు క్లబ్ లోకి చేరిన ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఫలితంగా సంకాంత్రి  రేస్ లో విన్నర్ గా నిలబడింది

 అందరినీ కడపు నిండా నవ్వించే ఫూల్ కామిడీకి కరువు లేదు...దీంతో 100% కామెడీ టైమింగ్ ఉన్న మూవీగా నిలిచింది. దానికి తోడు సినిమాలో ఎమోషన్స్  కూడా ప్రేక్షకులు ఆకట్టుకుంటోంది. ఈ ఆన్ స్క్రీన్ తోడల్లుళ్ళ కెమిస్ట్రీ, ప్రతి ఫ్యామిలీకి జెన్యూన్ గా కనెక్ట్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఈ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వెంకీ ఇలాంటి న్యాచురల్ కామెడీ చేస్తుండగంతో జనాలు ఈ మూవీను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కి  సరికొత్త సర్ ప్రైజ్ అనిపించుకుంది.

 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి అడిషనల్ గా మరో 5 సీన్స్ ని ఆడ్ చేస్తున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మించాడు ఈ సినిమాని. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్స్. ఒక్కరిని కడుపు నిండా నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. 100 కోట్ల సినిమాని అందించడమే కాదు, 100% కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు.
 

Trending News