ఫేస్‌బుక్‌ కాదు.. 'ఫేక్'బుక్

ఫేస్‌బుక్‌ లో 10 శాతం నకిలీ ఖాతాలే..!

Last Updated : Feb 5, 2018, 01:18 PM IST
ఫేస్‌బుక్‌ కాదు.. 'ఫేక్'బుక్

ఫేస్‌బుక్‌లో 20కోట్ల 'ఫేక్' అకౌంట్లు ఉన్నాయట. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ 2017 డిసెంబర్ నాటి వార్షిక నివేదికలో ప్రకటించింది. ఈ నకిలీ ఖాతాలు భారత్‌లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. 2017 నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెలవారీ ఆక్టివ్ యూజర్ల(ఎంఏయూ)లో 10 శాతం నకిలీ ఖాతాలే అని తెలిపింది.

'ఫేక్' అకౌంట్లు ఉన్న దేశాల్లో భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. 2017 చివరి నాటికి మొత్తం 2.13 బిలియన్ ఎంఏయూలు ఉన్నారని, 2016 కంటే ఇది 14 శాతం అధికమని తెలిపింది. ఇలా పెరగటానికి భారత్, ఇండోనేషియా లాంటి దేశాలే కారణమని కూడా పేర్కొంది. ఒక యూజర్‌కి ఒకటికంటే ఎక్కువ ఖాతాలుంటే.. అందులో ఒకటి తప్ప మిగితావన్నీ నకిలీవేనని తేల్చింది ఫేస్‌బుక్‌ సంస్థ.

Trending News