శర్వానంద్ మూవీ కోసం టైటిల్ వేట..!!

శర్వానంద్ టైటిల్ విషయంలో వస్తున్న రూమర్స్ పై చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ స్పందించారు

Last Updated : Apr 25, 2019, 01:37 PM IST
శర్వానంద్ మూవీ కోసం టైటిల్ వేట..!!

యంగ్ హీరో శర్వానంద్ సరికొత్త మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయింది. ఈ మూవీలో  రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు శర్వా. సినిమాకు రెండూ కీలకమైనవే. అందుకే ఏ షేడ్ ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ ఫిక్స్ చేయాలో యూనిట్ కన్ఫూజ్ లో ఉన్నారట. 

తొలుత ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని రూమర్స్ వచ్చాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ ను  శర్వా సినిమా డైరక్టర్ సుధీర్ వర్మ ఖండించారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. మూవీ  టైటిల్ ఏంటనేది ఇంకా డిసైట్ చేయలేదని ..మంచి టైటిల్  కోసం వేట కొనసాగుతుందని ప్రకటించాడు.

క్లాస్ టచ్ ఇచ్చే టైటిల్ కాకుండా, శర్వా డాన్ క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా మూవీలో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు

Trending News