ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇతర పరికరాల్లో గూగుల్ తన యాప్స్ బ్లాక్ చేస్తోంది. మార్చి 16, 2018 తరువాత తయారైన ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతుంటే అందులో గూగుల్ యాప్స్, ఏమీ పనిచేయవు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం నుంచి చాలా కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయని, వాటికి తమ ధృవీకరణ లేకపోతే మాత్రం పనిచేయవని గూగుల్ వెల్లడించింది. కాగా ఈ నిర్ణయంతో ఆర్వోఎం(ROM) లోడ్ చేసి టెస్ట్ వారికి ఇబ్బందేనని తెలుస్తోంది.
'ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. ఇందులో మిలియన్ వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. మీ ఆండ్రాయిడ్ పరికరం గూగుల్ చేత ద్రువీకరించబడినట్లయితే, మీరు గూగుల్ అధికారిక యప్స్‌లను డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సర్టిఫికేట్ లేకపోతే యాప్స్‌లను డిస్ట్రిబ్యూట్ చేసుకోలేరు' అని వెర్జ్ నివేదిక తెలిపింది.
'గూగుల్ ఇప్పుడు గూగుల్ యాప్స్ లను వాడేవారి ఆండ్రాయిడ్ సిస్టంల బిల్డ్ తేదీలను తనిఖీ చేస్తోంది. ధృవీకరణ లేని పరికరాన్ని కలిగి ఉండి, మార్చి 16, 2018 తర్వాత తయారైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, గూగుల్ యాప్స్ పనిచేయవు' అని నివేదిక పేర్కొంది.
గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ ఆధారంగా ఒక స్మార్ట్ఫోన్ యొక్క ఫిర్మ్వేర్‌ను కస్టమ్ ఆండ్రాయిడ్ ఆర్వోఎం సూచిస్తుంది.
"మీ పరికరంలో గూగుల్ యాప్స్‌ల అనుమతికై మీ ఆండ్రాయిడ్ ఐడీతో మీ పరికరాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయంతో ఆర్వోఎం(ROM) లోడ్ చేసి టెస్ట్ వారికి ఇబ్బంది కలిగించవచ్చు" ది వెర్జ్ రిపోర్ట్ తెలిపింది.