chiranjeevi gift : గిఫ్ట్ ఇచ్చి మరీ టైం బాగుంటుందని చెప్పాడట.. చిరుపై వీర సింహా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని

chiranjeevi gift to Gopichand Malineni చిరంజీవి ఇచ్చిన బహుమతి మీద గోపీచంద్ మలినేని తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వాచ్ గిఫ్ట్ ఇచ్చి.. నీ టైం బాగుంటుందని అన్నాడట చిరంజీవి. తాజాగా గోపీచంద్ చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 12:45 PM IST
  • వీర సింహా రెడ్డితో ట్రెండింగ్‌లో డైరెక్టర్
  • చిరు ఇచ్చిన గిఫ్ట్‌పై గోపీచంద్ మలినేని
  • వీర సింహా రెడ్డిపై డైరెక్టర్ గోపీచంద్
chiranjeevi gift : గిఫ్ట్ ఇచ్చి మరీ టైం బాగుంటుందని చెప్పాడట.. చిరుపై వీర సింహా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని

chiranjeevi gift to Gopichand Malineni వీర సింహా రెడ్డి సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు. సినిమాను నందమూరి అభిమానులకు నచ్చేలా తీసి వారిని మెప్పించాడు. బాలయ్యను ఇది వరకటి కంటే ఎంతో పవర్ ఫుల్‌గా చూపించాడు. ఇక బాలయ్య చేత చెప్పించిన డైలాగ్స్ టీడీపీ శ్రేణులకు కూడా బాగానే నచ్చేట్టున్నాయి. బాలయ్య ఈ సినిమాతో మంచి కలెక్లన్లనే రాబట్టేస్తున్నాడు.

 

గోపీచంద్ మలినేని తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకు గెస్టుగా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో గోపీచంద్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. తనకు మెగాస్టార్, మెగా ఫ్యామిలీతో ఉన్న బంధాన్ని చెప్పుకొచ్చాడు. తనను ఎక్కువగా రవితేజతో పోల్చుతారని, చిరంజీవి అయితే బక్క రవితేజ ఎక్కడున్నాడు అని అడుగుతాడంటూ గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.

తాను ఒకసారి షూటింగ్‌లో ఉన్నప్పుడు అల్లు అరవింద్, చిరంజీవి వచ్చారట. తన కోసం గిఫ్ట్ తెప్పించాడట. వాచ్ గిఫ్ట్‌గా ఇస్తూ నీ టైం బాగుంటుందని అన్నాడట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోయాడు గోపీచంద్ మలినేని. ఇక వీర సింహా రెడ్డి సినిమాలోని డైలాగ్స్ మీద కూడా స్పందించాడు. అవేమీ కూడా కావాలని రాయలేదు అని క్లారిటీ ఇచ్చాడు.

ఇంత వరకు తనకు ఏ నిర్మాత కూడా ఫుల్లుగా డబ్బులు ఇవ్వలేదని, మొదటి సారిగా తన లైఫ్‌లో వీర సింహా రెడ్డి సినిమాకే పూర్తిగా డబ్బులు తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్‌ మలినేని. ఇక తాను రవితేజలా ఉంటానని, అప్పుడప్పుడు రవితేజ తాను షాట్‌లో ఉండ లేకపోతే, వెళ్లాల్సి వస్తే.. అబ్బాయ్ నువ్ ఉండు షాట్‌లో అని అంటాడట.

Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట

Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News