Mobile phone theft: ఫోన్ దొంగలను పట్టించిన హ్యాక్ ఐ యాప్ !!

హైదరాబాద్ పోలీసులు సాంకేతికతను ఉపయోగించి సరికొత్త పంథాలో దొంగలను పట్టుకున్నారు

Last Updated : Jan 12, 2019, 06:39 PM IST
Mobile phone theft: ఫోన్ దొంగలను పట్టించిన హ్యాక్ ఐ యాప్ !!

హైదరాబాద్: హ్యాక్ ఐ యాప్ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. దీంతో చోరీకి గురైన 35 ఖరీదైన సెల్‌ఫోన్లు రికవర్ చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే నగరంలోని బీరంగూడ వద్ద రామచంద్రాపురంలో ఉన్న బిగ్‌సీ మొబైల్స్ షోరూం వెనుక కన్నంపెట్టి 35 ఖరీదైన సెల్‌ఫోన్లను చోరీ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును చేధించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. చివరికి పోలీసులు ప్రయత్నం ఫలించింది.. హ్యాక్ ఐ యాప్ వినియోగించి చోరీకి గురైన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసు వివరాలను సీపీ అంజన్ కుమార్ మీడియాకు వివరించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు దొంగలను అరెస్ట్ చేశామన్నారు. ఈ ఫోన్లను హ్యాక్ ఐ యాప్ ద్వారానే గుర్తించినట్టు తెలిపారు. నగరంలో వివిధ రూపాల్లో చోరీ ముఠాను పట్టుకునేందుకు నగరంలోని 30కిపైగా పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను వీక్షించే పీవీఎస్‌లను ఏర్పాటు చేశామని.. మరో రెండు నెలల్లో మిగిలిన 30 స్టేషన్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో హ్యాక్ ఐ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు

Trending News