విలన్ పాత్రలో సునీల్

హైదరాబాద్: కమెడియన్ గా ప్రస్థానం ఆరంభించి ప్రేక్షకులను అలరించిన సునీల్ ఆపై రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న చిత్రం లో హీరోగా మారిన నటుడు సునీల్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది.

Last Updated : Dec 29, 2019, 05:37 PM IST
విలన్ పాత్రలో సునీల్

హైదరాబాద్: కమెడియన్ గా ప్రస్థానం ఆరంభించి ప్రేక్షకులను అలరించిన సునీల్ ఆపై రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న చిత్రం లో హీరోగా మారిన నటుడు సునీల్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. సునీల్ ఇప్పుడు విలన్ గా మారాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న కలర్ ఫొటో చిత్రంలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, వాటిలో కామెడీ టచ్ ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం సునీల్ పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోందని సినీ వర్గాలు తెలిపాయి. కాగా, కలర్ ఫొటో చిత్రంలో సుహాస్, సందీప్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో నాని రిలీజ్ చేశారు.

Trending News