హన్సిక సరికొత్త పంథా ; యంగ్ హీరోస్ తో సై అంటున్న ముద్దుగుమ్మ

ఒక సినిమాలో హన్సిక ఉందంటే ఆల్మోస్ట్ సినిమా సూపర్ హిట్టే. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి.. టైం మారింది

Last Updated : Mar 1, 2019, 12:36 PM IST
హన్సిక సరికొత్త పంథా ; యంగ్ హీరోస్ తో సై అంటున్న ముద్దుగుమ్మ

తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోల సరసన నటించని ముద్దుగుమ్మ హన్సిక కు బ్యాట్ టైం నడుస్తోంది. ఇప్పుడు ఆమెకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఎప్పుడో 2017 లో ‘గౌతమ్ నంద’ సినిమాలో గోపీచంద్ సరసన నటించిన హన్సిక  మళ్ళీ హీరోయిన్ గా చాన్స్ దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా ‘NTR కథానాయకుడు’ లో జయప్రద గా కనిపించినా, పెద్దగా వైబ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ కి ఫేవరేట్ హీరోయిన్ హన్సిక. 

మళ్లీ తెరపైకి వచ్చి సత్తా చాటేందుకు హన్సిక  ప్లాన్ ‘బి’ అమలు చేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ  మళ్ళీ యంగ్ హీరోస్ తో కూడా జత కట్టేస్తుంది. రీసెంట్ గా సందీప్ కిషన్ తో కలిసి ‘తెనాలి రామకృష్ణ BA BL’ సెట్స్ పైకి వచ్చేసింది. మరి ఈ మూవీ హన్సిక కి మరిన్ని ఆఫర్స్ తీసుకొచ్చి పెడుతుందా..? యంగ్ హీరోస్ తో జతకట్టి మళ్లీ పూర్వవైభవం హన్సిక తెచ్చుకుంటుందో లేదో చూడాలి మరి

Trending News