సరికొత్త ట్రెండ్: అనుష్క మూవీలో హాలీవుడ్ స్టార్ 

                                      

Last Updated : Mar 18, 2019, 06:08 PM IST
సరికొత్త ట్రెండ్: అనుష్క మూవీలో హాలీవుడ్ స్టార్ 

బాహుబలి హీరోయిన్ అనుష్క నటిస్తున్న నెక్స్ట్ మూవీలో హాలీవుడ్ స్టార్ నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఆ హాలీవుడ్ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఏంటా మూవీ.. ఎవరా నటుడు అనకుంటున్నారా ?  అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

అనుష్క‌, మాధ‌వ‌న్ జంటగా తెరపైకి వస్తున్న సినిమా “సైలెన్స్”. ఇప్పుడీ ప్రాజెక్టులో  హాలీవుడ్ స్టార్ కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ వచ్చి చేరుతున్నాడట.  దాదాపు వందకి పైగా  హాలీవుడ్ సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ నటించి సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా మ్యాడ్సన్ తొలి ఇండియన్ సినిమా నటించేందుకు ముందకు రావడం గమనార్హం. అయితే ఇందులో మ్యాడ్సన్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

ఇదిలా ఉండగా మ‌ధుక‌ర్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ మూవీకి  సంగీతాన్ని అందిస్తున్నాడట . ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది.  ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. యూఎస్ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయబోతున్నారు.

Trending News