ఐడియా సరికొత్త ఆఫర్ ప్రకటన రోజుకు 2 జీబీ డేటా

Last Updated : May 24, 2018, 03:01 PM IST
ఐడియా సరికొత్త ఆఫర్ ప్రకటన రోజుకు 2 జీబీ డేటా

ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఐడియా సరికొత్త కొత్త ఆఫర్ ప్రకటించింది. తమ వినియోగదారుల కోసం సరికొత్త  ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసింది. తాజా ఆఫర్ ను అనుసరించి కేవలం రూ. 499 తో రిఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజూ 2జీబీ డేటా ప్యాక్ ను అందిస్తోంది.దీంతో పాటు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ ఆఫర్లు ఇస్తోంది. 

తన ప్రత్యర్థి కంపెనీలు జియో, ఎయిర్ టెల్ కు పోటీగా ఐడియా ఈ ప్లాన్ ను ఆవిష్కరించింది. అయితే జియో సైతం రూ.498 ప్లాన్ ను 91 రోజుల వ్యాలిడిటీతో 182 జీబీ డేటా అందిస్తోంది. అటు ఎయిర్ టెల్ కూడా రూ.499 ప్లాన్ ను 82 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐడియా ఆఫర్ ఏ మేరకు సక్సెస్ అవుతోందనేది గమనార్హం.

Trending News