మహానటిపై ఆసక్తిని పెంచుతున్న చిత్ర యూనిట్

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Last Updated : May 7, 2018, 12:56 PM IST
మహానటిపై ఆసక్తిని పెంచుతున్న చిత్ర యూనిట్

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు కారణం వివిధ భాషలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తుండటమే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత‌ అక్కినేని, దుల్కర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్టర్ క్రిష్‌, శ్రీనివాస్ అవసరాల, ప్రకాష్‌రాజ్ వంటి ప్రముఖ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. కాజల్ ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. 'మహానటిలో కాజల్ ఏమి చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వరకు ఆగండి' అంటూ కామెంట్ కూడా పెట్టింది.
 

 

Trending News