మెగా డాటర్, టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన పెళ్లికి సంబంధించి హింట్స్ ఒక్కో ఫొటోను సోషల్ మీడియాలో వదులుతోంది. తను ఇక నుంచి మిస్ కాదని మిస్సెస్ కాబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో నిహారిక చెప్పకనే చెప్పింది. అందరూ అసలు విషయం చెప్పవా అని అడిగేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. నిహారిక పెళ్లి ఫిక్స్.. క్లారిటీ అడుగుతున్న నెటిజన్లు
ఓ యువకుడ్ని అప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను నిహారిక అలా షేర్ చేసిందో లేదో.. ఆమెకు కంగ్రాట్స్ చెప్పిన వారి కంటే అతడి ముఖం చూపించవచ్చు కదా అని అడిగిన వారే అధికం. కొందరు హీరోయిన్లు, నటీనటులైతే ఇక చేసింది చాలు, అతడు ఎవరో చూపించు, మాకు వివరాలు చెప్పవచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ చిట్టి తల్లీ అని సాయిధరమ్ తేజ్ విషెస్ తెలిపాడు.
టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. నిహారిక కొణిదెల వివాహాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి కుమారుడితో నిశ్చయించారు. ఆ యువకుడి పేరు చైతన్య అని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో నిశ్చితార్థం, లేకపోతే ఆగస్టులోనైనా ఎంగేజ్‌మెంట్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ