మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నారా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి కాబోతున్నారని ఓ వార్త తెలుగు సినీ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. 

Last Updated : Feb 19, 2018, 02:33 PM IST
మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నారా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి కాబోతున్నారని ఓ వార్త తెలుగు సినీ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. తారక్, ప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ రామ్ పేరుతో 4 ఏళ్ళ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మే నెలలో నందమూరి కుటుంబంలోకి మరో వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని.. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి కాబోతున్నాడని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్ వేదికలుగా చాలా వార్తలు హల్చల్ చేస్తు్న్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి మరో చిత్రంలో నటించబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2017లో నటించిన "జై లవకుశ" చిత్రం హిట్ అయిన సంగతి తెలిసిందే. 

Trending News