"కాలా" చిత్రం తొలి సాంగ్ విడుదల..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘కాలా’.  ‘కబాలి’ చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మేడేని పురస్కరించుకొని ఈ సినిమాలో ఫస్ట్‌ సింగిల్‌ను సినిమా యూనిట్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది. జూన్ 7వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Last Updated : May 1, 2018, 09:12 PM IST
"కాలా" చిత్రం తొలి సాంగ్ విడుదల..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘కాలా’.  ‘కబాలి’ చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మేడేని పురస్కరించుకొని ఈ సినిమాలో ఫస్ట్‌ సింగిల్‌ను సినిమా యూనిట్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది.

జూన్ 7వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో రజనీకాంత్ ముంబయి డాన్‌గా నటిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ కెరీర్లో 164వ సినిమా అయిన కాలా చిత్రంలో నానా పటేకర్, హుమా ఖురేషి, సంపత్ రాజ్, సముద్రఖని, షియాజీ షిండే మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన ఈశ్వరి రావు జంటగా నటించడం గమనార్హం.

మరి ఈ పాట లిరిక్స్ మనం కూడా ఒకసారి వినేద్దామా..!
 

యమ గ్రేటు..  భయము ఎరుగని.. వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు
మనము తలవగా..మనసు పిలవగా.. కలత తీర్చే ఇటు వచ్చినాడు చూడు
అరె.. నలుపే మన శ్రమజీవుల వర్ణమిక.. గెలుపే మన కరికాలుడి సొంతిమిక
చెక్కుచెదరి పోతారు..కన్ను ఎర్రజేసిన
బొక్కలిరగదన్ని పంపుతాడు ఎవ్వడొచ్చినా
బీ కేర్ ఫుల్.. ఇదేరా ధారావి.. ఈడ వాడవాడలా కాలా పేరు మ్రోగాలి
హే.. మార్చు నీ దారి.. కాలా శేఠ్ ఒక సుడిగాలి

Trending News