Most Expensive Water in the World: బాప్రే వాటర్ బాటిల్ ధర రూ. 1.15 లక్షలకు పైమాటే.. ఎపుడైనా చూసారా..?

Most Expensive Water in the World: విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు వారి దగ్గర అన్ని వస్తువులు ఖరీదైనవే ఉండేటట్లు చూసుకుంటారు. ఇలాంటి వారి కోసం ఓ కంపెనీ ఖరీదైన నీరును అందిస్తోంది. మీరు కంపెనీ విక్రయించే ఈ నీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 24, 2023, 11:20 AM IST
Most Expensive Water in the World: బాప్రే వాటర్ బాటిల్ ధర రూ. 1.15 లక్షలకు పైమాటే.. ఎపుడైనా చూసారా..?

Most Expensive Water in the World: మనం ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వస్తువులను చూసి ఉంటాం. అంతేకాకుండా ఖరీదైన ఆహార పదార్థాలను కూడా తిని ఉంటాం. ఎప్పుడైనా మీరు లక్షలు విలువచేసి నీటిని చూశారా..? చాలామందికి సందేహం కలుగవచ్చు సాధారణంగా రూ. 20 బాటిల్ లభించే నీరు లక్షల రూపాయలు ఉండడం ఏంటని.. విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు ఈ నీటిని తాగుతారు. ఈ నీరు సాధారణ నీరు లాగే ఉంటుంది. కానీ విభిన్న రంగులో ఉంటుందని సమాచారం. ఈ ఖరీదైన నీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఖరీదైన నీటికి సంబంధించిన కంపెనీలు ప్రస్తుతం ఎన్నో పుట్టుకు వచ్చాయి. అంతేకాకుండా వీటిని కొనేందుకు కూడా వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలావరకు ఈ ఖరీదైన నీరు సాధారణంగా లభించే నీటికి భిన్నంగా ఉంటుందని విక్రయదారులు తెలుపుతున్నారు. మిగతా నీటి లాగా ఇందులో వ్యర్థ పదార్థాలు ఉండవని.. శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకారు లభిస్తాయని వారంటున్నారు. 

Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఖరీదైన వాటర్ను వినియోగించే దేశాల్లో జపాన్ ముందుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. జపాన్ లో ఫెలికో జువెలరీకి చెందిన ఓ బ్రాండ్ ఈ వాటర్ ను తయారు చేసి విక్రయిస్తుందని.. ఈ ఒక్క వాటర్ బాటిల్ ధర రూ. 1.15 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. సాధారణంగా మనం ఈ డబ్బులతో ఏకంగా ఒక బోరుబావిని వేయించుకొని జీవితాంతం నీటిని తాగొచ్చు. కంపెనీ ఈ వాటర్ ను చాలా దేశాలకు ఎగుమతులు చేస్తుందని, కేవలం వాటర్ బాటిల్స్ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారని తెలుస్తోంది.

ఈ వాటర్ ప్రత్యేకత:
చాలామంది అనుకోవచ్చు లక్షల ధరతో నీటిని విక్రయిస్తున్నారంటే ఎన్నో లాభాలు ఉంటాయని.. కానీ ఇదంతా ఏమీ లేదు.. ఈ నీటిని కంపెనీ ఒసాకా సమీపంలో ఉన్న మౌంట్ రోకో జలపాతాల నుంచి నీటిని సేకరిస్తుంది. ఇక్కడ నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి కంపెనీ విక్రయిస్తుందని సమాచారం. అంతేకాకుండా ఈ నీటిలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉండి.. శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో 750 ML నీటితో కలిగిన కంపెనీ రూ. 1.15 లక్షలకు విక్రయిస్తోంది.

Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News