పెళ్లి తర్వాత చైతూ, సమంత కలిసి నటించిన ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

మజిలీ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌

Last Updated : Dec 30, 2018, 02:52 PM IST
పెళ్లి తర్వాత చైతూ, సమంత కలిసి నటించిన ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత జంట తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా మజిలీ. ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ నాలుగో చిత్రం ఇది నిన్ను కోరి చిత్రం ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మజిలీ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌ని తాజాగా చైతూ తన ట్విటర్ పేజ్ ద్వారా విడుద‌ల చేశాడు. ‘ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనది అని ట్వీట్ చేసిన చైతూ.. కొత్త ఏడాదిని ఈ చిత్రంతో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తంచేశాడు. ఈ ఫస్ట్ లుక్‌తోపాటే అందరికీ ఆడ్వాన్స్‌ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు చెబుతూ.. ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం తన కలగా చైతూ అభివర్ణించాడు. అంతేకాకుండా ఏప్రిల్‌లో కలుద్దాం అని చెబుతూ పరోక్షంగా మజిలీ సినిమా ఏప్రిల్‌లో ఆడియెన్స్ ముందుకొస్తుందని తెలిపాడు.

చైతూ, సామ్‌ ఒకరినొకరు మైమరిచిపోయి చూసుకుంటున్న‌ట్టు వున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసి వున్న బోర్డును గమనించొచ్చు.

Trending News